Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబర్ , 14, సాక్ష్యం న్యూస్: పద్మనాభంలో వేంచేసియున్న అనంత పద్మనాభస్వామి చతుర్దశి వేడుకలు ఈ నెల 17 న నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అదికారి నానాజీబాబు చెప్పారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో రానున్న భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా అనంతుని వ్రతాలను కుంతీ మాధవస్వామి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Admin
Neti Sakshyam