Monday, 24 August 2026 05:54:39 AM

అగ్ని ప్రమాద బాధితులకు అండగా టిడిపి నేతలు

Date : 10 October 2024 02:04 PM Views : 694

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబర్ 10 సాక్ష్యం న్యూస్ ,అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంగన్నగూడెం గ్రామానికి చెందిన తెలుగు యువత యువనేత వెన్నమనేని రాజా అన్నారు. గురువారం దెందులూరు మండలం గాలాయగూడెం నాగుల దేవుని పాడు దళిత వాడలో విద్యుత్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైన ఇంటి కుటుంబాన్ని గాలాయగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూజారి శ్రీనివాసరావు టిడిపి నేతలు పూజారి రాజశేఖర్ తదితరులతో కలిసి అగ్ని బాధిత నందేటి ఏసమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఆమెకు టిడిపి నాయకులు ఆర్థిక సహాయాన్ని నిత్య సరుకులను అందించారు .ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణుల విభాగం సాధికారిక దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొప్పాక వెంకటేశ్వరరావు కొండ టిడిపి నేత కొండయ్య తదితర టిడిపి నేతలు ఉన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :