Tuesday, 15 September 2026 04:59:23 AM

తహాశీల్దారు ఆనందకుమార్ బదిలీ. ఆనందరావుకి భాద్యతలు.

Date : 27 September 2024 05:14 PM Views : 675

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబరు 27 సాక్ష్యం న్యూస్: పద్మనాభం మండల తహాశీల్దారు ఎం.ఆనందకుమార్ని పెందుర్తికి తహాశీల్దారుగా బదిలీ చేసినట్లు జిల్లా ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఆనందరావు త్వరలో పదవీ భాద్యతలు చేపట్టనున్నారు. కేవలం రెండు నెలలు మాత్రమే పద్మనాభం తహశీల్దారుగా పనిచేసిన ఆనందకుమార్ ప్రజల మన్ననలు పొందారు. బదిలీపై వెళ్తున్న ఆనందకుమార్ కి సిబ్బంది వీడ్కోలు పలికారు. అనంతరం నూతనంగా విధులకు హాజరైన D.T కె.చంద్రశేఖర్ తోపాటు ఏడుగురు నూతన VROలు టి.కృష్ణవేణి, ఆర్.సుమిత్ర, వి.ప్రవలిక, ఎం.శ్రీనివాసరావు, స్వాతి, బి.వి.ఎస్.రామారావు, టి.అప్పలరాజు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టగా.. వారికి తోటి సిబ్బంది స్వాగతం పలుకుతూ.. ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. అలాగే నూతన RI గా వి.ఎం.ఆర్.డి.ఎ. నుండి శ్యామల పద్మనాభంకి రానున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :