Monday, 24 August 2026 07:07:32 AM

పద్మనాభం మండలంలో చురుకుగా పల్లెపండుగ కార్యక్రమాలు

Date : 19 October 2024 10:51 PM Views : 1154

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబరు 19 సాక్ష్యం న్యూస్: మండలంలోని పలు గ్రామాలలో శనివారం రాత్రి మండల టీడీపీ అధ్యక్షుడు కోరాడ రమణ ఆధ్వర్యంలో పల్లె పండుగ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో బాగంగా లక్షలాది రూపాయలతో నిర్మించనున్న సి సి రోడ్లకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంఖుస్థాపన చేసారు. రేవిడి పచాయితీ పరిధిలో ఉన్న బర్లవాని కళ్లాలలో 15,వెంకటాపురం పంచాయతీ పరిధిలో పల్లావారి కళ్లాలలో 15, గెద్దపేట గ్రామంలో 15, బి.తాళ్లవలస గ్రామంలో 30, అయినాడ గ్రామంలో 15 లక్షలతో సి సి రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంఖుస్థాపన చేసారు. ఈ రోడ్ల నిర్మాణాలను త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఇదిలా ఉండగా గెద్దపేట గ్రామంలో ఎంపీపీ కె.రాంబాబు, గ్రామ సర్పంచ్,మండల వైసీపీ అధ్యక్షుడు కె.లక్ష్మణరావు గంటాను శాలువ కప్పి పుష్ప గుచ్చంతో గంటాను సత్కరించారు.

Naidu (Sr Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :