Monday, 24 August 2026 05:53:58 AM

గ్రామాల్లో యుద్ద ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టాలి. // MPP రాంబాబు //

Date : 10 September 2024 12:49 PM Views : 977

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబరు 10 పద్మనాభం సాక్ష్యం న్యూస్: మండలంలో పలు గ్రామాలలో యుద్ద ప్రాతిపదికన పారిశుధ్య పనులను చేపట్టాలని ఎంపీపీ కె.రాంబాబు గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. తుఫాను వల్ల కలిగే నష్టంపై మంగళవారం ఆయన ఆదేశాల మేరకు ఎంపిడీఒ విజయకుమార్ గ్రామ కార్యదర్శులతో మండల పరిషత్ సమావేశ మందిరంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాంబాబు మాట్లాడారు.

తుఫాను వల్ల అంటువ్యాదులు ప్రభల కుండా చర్యలు చేపట్టాలని, అలాగే మంచినీటి బోర్లు, ట్యాంకులలో క్లోరినేషన చేయాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో కూడా పారిశుద్ధ్యం పనులను చేయించాలని, కరెంటు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీటీసీ ఎస్.గిరిబాబు మాట్లాడుతూ త్వరలోనే మరో తుఫాను రానున్నదని, వాతావరణ కేంద్రం హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి నష్టాలు నష్టాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు చెరువులను పరిశీలించి గండ్లు కొట్టకుండా చర్యలు తగు చర్యలు చేపట్టాలని వివరించారు. ఈ కార్యక్రమంలో MPDO విజయకుమార్,ఈ.ఒ.అర్.డి .కుమార్, కార్యదర్శులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: