Wednesday, 16 September 2026 06:12:38 AM

డయేరియా బారిన 16 మంది బాలికలు ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

Date : 01 August 2024 07:02 PM Views : 454

Neti Sakshyam - వార్తలు / శృంగవరపుకోట (S.కోట) : శృంగవరపుకోట మండలం చిట్టంపాడు గ్రామం లో డయేరియాతో బాధపడుతున్న 16 మంది పిల్లల్ని గురువాం ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఓ పాపకి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా విజయనగరం జిల్లా రామవరం గ్రామానికి చెందిన ఓ క్రిస్టియన్ స్కూల్ లో చదువుకుంటున్నారు, అయితే బుధవారం పాఠశాల లో మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం వీరందరికి ఫుడ్ పాయిజన్ అవటం గమనించిన స్కూల్ సిబ్బంది కొందరిని విజయనగరం జిల్లా ఆసుపత్రికి చికిత్స కొరకు, మిగతా వారిని తమ తల్లిదండ్రులకు అప్పగించారు.

శృంగవరపుకోట మండలం మూల బొడ్డవర పంచాయితీ చిట్టిపాడు గ్రామానికి చెందిన పదహారు మంది విద్యార్థులు తమ గ్రామానికి చేరుకున్న తరువాత వీరందరికి వాంతులు విరోచనాలు అవటం తో

అందులో మజ్జి సన్యాసమ్మ 9ఏళ్ళ బాలిక పరిస్థితి విషమంగా ఉండటం తో గురువారం ఉదయం విరందరినీ శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందుకుంటున్న వారిలో సన్యాసమ్మ (9) , జాన్ని నవ్య (9) సోముల కావ్య (5),మజ్జి దీన (7) మజ్జి జాకెరంగి సోకి (8)ఉన్నారు. యస్.కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల్ని పరామర్శించి, మెరుగాయిన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :