Friday, 19 June 2026 01:57:09 PM

కృష్ణంరాజుపేటలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక ప్రశాంతం

Date : 08 August 2024 04:57 PM Views : 416

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : అక్టోబర్ 8 సాక్ష్యంటివి డెస్క్: భీమిలి మండలం కృష్ణంరాజుపేటలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక ప్రశాంతగా జరిగింది. ప్రతి తరగతి నుంచి విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులైన ముగ్గురు సభ్యులను ఎన్నుకున్నుకోగా.. మొత్తం ఎన్నికైన 24 మంది సభ్యులలో ఒకరిని చైర్పర్సన్ గా మరొకరిని వైస్ చైర్మన్ గా ప్రకటించారు. అనంతరం ఆరుగురిని ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా మరొ ఇద్దరిని సభ్యులుగా ప్రకటిస్తూ..అందరి చేత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం, ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొట్టమొదటి కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో HM సత్యనారాయణ మాట్లాడుతూ... పాఠశాల అభివృద్ధికి అదేవిధంగా పాఠశాలలో డ్రాప్స్ లేకుండా శత శాతం పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించే విధంగా బాధ్యతలు ఎస్ఎంసి సభ్యులు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఎస్ఎంసి కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పూర్తిస్థాయిలో బాధ్యత వహించాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉపాధ్యాయులు ఆట వస్తువులు మొదలగు పాఠశాల సమగ్ర అభివృద్ధికి ఎస్ఎంసి కమిటీ పూర్తిగా సహకరించాలని తీర్మానించారు ఈ తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: