Neti Sakshyam - వార్తలు / విశాఖ/ తగరపువలస : అక్టోబర్ 20 తగరపువలస సాక్ష్యం న్యూస్ : కలిగొట్ల స్నిగ్ధశ్రీదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 76వ ఉచిత హోమియో మెడికల్ క్యాంపు ఆదివారం భీమిలి కార్యాలయంలో నిర్వహించారు. ఇక్కడికొచ్చిన సుమారు 100మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు ఫౌండేషన్ చైర్మన్ కలిగొట్ల శ్రీరామ్ తెలియజేసారు. గత 75 నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ.. నేటి 76వ శిబిరాన్ని ఏర్పాటు చేశామని గుర్తుచేసారు.
Reporter
Neti Sakshyam