Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబరు 7 సాక్ష్యం న్యూస్ : మండలంలో రేవిడి యానాద్రి చెరువు జంతుకళేభరాలు, కోళ్ళ వ్యర్ధాల నుంచి రక్షించాలని రేవిడి వెంకటాపురం ఎంపిటీసీ సీర సూరప్పడు కోరారు. ఈ నేపథ్యంలో మండల పంచాయతీ విస్తరణ అధికారిణి మీనాకుమారికి వినత పత్రం అందజేశారు. తగరపువలస, రేవిడి రహదారికి ఆనుకొని ఉన్న ఈ చెరువులోని పడేసిన కుళ్ళిన వ్యర్ధాల నుంచి వచ్చిన దుర్వాసనతో వాహన చోదకులు, పాదచారులు నానా అవస్థలు పడుతున్నారని వివరించారు. దీనిపై తగు చర్యలు చేపట్టి, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
Reporter
Neti Sakshyam