Friday, 19 June 2026 01:34:26 PM

ఆహ్లాదకరమైన వాతావరణంలో సమస్యల పరిష్కారం.

Date : 08 August 2024 01:54 PM Views : 436

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : ఆగస్టు 8, సాక్ష్యం టివి డెస్క్: తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే పిర్యాది దారులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు మరిన్ని మొక్కలు నాటడం జరిగిందని భీమిలి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ D రమేష్ తెలిపారు.

నిన్న మొన్నటి వరకూ స్టేషను ప్రాగణంలో అడ్డదిడ్డంగా ఉన్న సీజిడ్ వాహనాలను వేరే చోటికి తరలించారు. స్టేషనుకు వచ్చేవారు కూర్చునేందుకు వీలుగా ఇప్పటికే సిమెంట్ బల్లలు ఉన్నప్పటికీ..వారి సౌకర్యార్ధం మరిన్ని కుర్చీలు ఏర్పాటు చేశారు.ఇక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పలు పూల మొక్కలు నాటారు.ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను పడేయకుండా ఉండేందుకు అక్కడక్కడా చెత్త బుట్టలను కూడా ఏర్పాటు చేసి స్టేషను ప్రాంగణం అందంగా తీర్చి దిద్దారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: