Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబర్ 17 సాక్ష్యం న్యూస్: పద్మనాభంలో వేంచేసియున్న అనంత పద్మనాభస్వామి పవిత్రోత్సవాలు ఈ నెల 27 నుండి 30 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈ ఒ నానాజీబాబు తెలిపారు.వీటి నిర్వాహణపై ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎప్పటిలానే ఈ సారి కూడా పవిత్రోత్సవాలు ఘనంగా జరిగేందుకు భక్తులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక ఎంపీపీ రాంబాబు ఉత్సవ కమిటీ సభ్యులు నగేష్, ఎర్రినాయుడు, నారాయణరావు, సన్యాసిరావు, నర్సింగరావు, రామస్వామినాయుడు,అవనాపు రమణ,తదితరులు పాల్గొన్నారు.
Reporter
Neti Sakshyam