Friday, 19 June 2026 01:40:49 PM

గంధవరం వినాయక మండపం బారీ అన్నదాన సమారాధన

Date : 16 September 2024 09:57 PM Views : 576

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబరు16 సాక్ష్యం న్యూస్: మండలంలో గందవరం గ్రామంలో వినాయకుని నవరాత్రుల సందర్భంగా స్ధానిక మహాత్మా గాంధీ సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో సోమవారం దిగువ వీధి రామాలయం వద్ద ఉత్సవ కమిటీ బారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే సాయంత్రం వినాయకుని అనుపోతత్సవంను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సుమారు నాలుగు వేల మందికి రామాలయం వద్ద అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా పదమూడు వంటకాలతో భక్తులకు వండి వడ్డించారు. అనంతరం కమిటీ సభ్యులు, గ్రామ మహిళలు కార్యక్రమం పూర్తి అయిన తరువాత శుభ్రం చేసే పనులు చేపట్టారు.ఈ సందర్భంగా పదహారు కేజీల గణేష్ లడ్డును వేలం వేసారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :