Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : నవంబర్10,సాక్ష్యం న్యూస్:మండలంలో పాండ్రంగి గ్రామంలో కొలువు దీరిన మరిడమ్మ అమ్మవారి పండగను గ్రామ పెద్ద ఆర్.ఎస్.ప్రశాంతరాజు ఆధ్వర్యంలో గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అనాదిగా కొనసాగుతున్న ఆచారం ప్రకారం గ్రామ సతకం పట్టు వద్ద ముందుగా అమ్మవారికి పుజలు చేసారు. అనంతరం అక్కడ నుండి డప్పు వాయిద్యాలతో అమ్మవారిని ఊరేగింపుగా కుర్రపల్లి సమీపంలో ఉన్న పుట్ట వద్దకి తీసుకెళ్లి అనుపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ప్రజలు పసుపు కుంకమలు,సమర్పించి,మొక్కులు తీర్చుకున్నారు.
Admin
Neti Sakshyam