Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకుంటే! విధులకు హాజర్యేదే లేదని భీమిలి CHCలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, తదితర కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుంటే విధుల బహిష్కరణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ &వర్కర్స్ యూనియన్ (AITUC)జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ అన్నారు. శనివారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఫణికుమార్ కు పలు సమస్యలు తో కూడిన వినతిపత్రం అందించారు.
గత 4 నెలలుగా చెల్లించని జీతాలను తక్షణమే చెల్లించాలని, ప్రభుత్వం జీవో ప్రకారం కనీస వేతనం అములు చేయాలని, పి ఎఫ్, ఇ ఎస్ ఐ సక్రమంగా అములు చేయాలని, యూనియన్ అధ్యక్షురాలు భవాని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్మికులను తొలిగించే విధానాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే! సెప్టెంబర్ 1 నుంచి నిరసనలు చేపట్టడం జరుగుతుందని... స్పందించ కుంటే 15వ తేదీ నుంచి విధులను బహిస్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామలక్ష్మి, వెంకట లక్ష్మి, మహా లక్ష్మి నాయుడు , N.లక్ష్మి. D.ఈశ్వరమ్మ, S. ఎల్లాజీ,పెంటయ్య, ఎన్.నూక రాజు బి లక్ష్మి,శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam