Friday, 31 July 2026 12:07:35 AM

సోమవరప్పాడు లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

Date : 07 October 2024 03:24 PM Views : 571

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబరు 7 సాక్ష్యం న్యూస్: తెలుగోడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు అని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం దెందులూరు మండలం సోమవారపు పాడు గ్రామంలోని నాలుగు రోడ్లు కూడలి వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి, తెలుగుదేశం పార్టీ యువ నేత మాగంటి గిరిధర్, మండల టిడిపి అధ్యక్షుడు మాగంటి నారాయణ ప్రసాద్( మిల్లు బాబు), తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు మోతుకూరు నాని బాబు, సోమవారపు పాడు గ్రామ టిడిపి అధ్యక్షుడు కర్రి రంగారావు మరియు స్థానిక టిడిపి నేతలతో కలిసి తాను నూతనంగా ఏర్పాటు చేసిన యన్.టి.ఆర్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గజమాలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు డాక్టర్ పసుమర్తి మధుబాబు, ఇప్పిలి వెంకటేశ్వరరావు, గారపాటి కొండయ్య చౌదరి, సంపంగి వేణుగోపాల తిలక్,సానిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ యలమర్తి శీను బాబు,పూజారి శ్రీనివాసరావు,సోమవరపాడు టిడిపి నేత సురేష్, మాజీ ఎంపీటీసీ అల్లు జ్యోతి నాగేశ్వరరావు,బీసీ సెల్ మండల అధ్యక్షుడు నున్న లక్ష్మణ్ బాబు, విద్యా విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: