Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : పద్మనాభం మండలం విజయానందపురం గ్రామంలో శుక్రవారం ఓ వ్యక్తి గడ్డి మందు మృతి చెందినట్లు ఎ.ఎస్.ఐ. నక్కా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సంఘటనపై ఆయన అందించిన వివరాల ప్రకారం విజయానందపురం గ్రామానికి చెందిన పాలెపు అప్పలరాజు(56) ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తన్నాడు. అయితే చాలా కాలం నుండి ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఆయన్ని వెంటాడడంతో ఈ నెల ఒకటవ తేదీన గడ్డిమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అప్పలరాజును విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.మృతుడుకి భార్య ,ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
Neti Sakshyam