Saturday, 01 August 2026 12:41:31 AM

కోలాటం ఫొటోల్లో కూటమి నాయకుల కుట్ర?

Date : 10 October 2024 09:38 AM Views : 797

Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : అక్టోబరు 9 సాక్ష్యం న్యూస్: విజయదశమిని పురస్కరించుకొని నిర్వహించిన కోలాటం పోటీలలో విజేతలకు అన్యాయం జరిగిందని ఆనందపురం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కళాకారులు ఆందోళన చేపట్టారు. బుధవారం గంటా నారాయణమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గం MLA గంటా శ్రీనివాసరావు సహకారంతో ఆనందపురం mpdo కార్యాలయం ఆవరణలో జరిగిన కోలాటం పొటీలు నిర్వహించగా.. విజేతలను ఎంపిక చేయడంలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ..గొట్టిపల్లి పంచాయతీ కి చెందిన బంగారమ్మ తల్లి కోలాటం గ్రూపు సభ్యులు ఆందోళనకు దిగారు. అధికారులు తొలుత తమ గ్రూపునే ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రకటించి,కొద్ది నిముషాల వ్యవధిలోనే మరో గ్రూపుని ప్రకటించడం పట్ల రాజకీయ కుట్ర దాగిఉందని ఆరోపిస్తూ..ఆందోళన బాట పట్టారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :