Friday, 19 June 2026 01:33:45 PM

అర్హులకు న్యాయం చేయడమే లక్ష్యం. //ఎమ్మెల్యే చింతమనేని//

Date : 21 August 2024 11:13 AM Views : 397

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : ఆగష్టు 20 దెందులూరు సాక్ష్యం న్యూస్: అర్హత కలిగిన ప్రతి పేదవాడికి 3సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి అండగా ఉంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.. దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు MLA చింతమనేనిని కలిసి సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.తమకు అర్హత ఉన్నా కూడా గత ప్రభుత్వంలో ఇంటి స్థలం మంజూరు కాలేదని పలు గ్రామాల నుంచి వచ్చిన కొందరు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ "గత వైసిపి పాలనలో లంచాలు తీసుకుని ఎంతో మంది అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం, అన్ని అవయవాలు సవ్యంగా ఉన్న వాళ్ళకు సైతం తప్పుడు సర్టిఫికెట్లు పెట్టీ దివ్యాంగ ఫించన్లు ఇవ్వడం వంటి అనేక అక్రమాలు జరిగాయని అన్నారు. అందువల్లే లబ్దిదారులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకపై అలాంటి అవినీతి జరగబోదని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు), లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: