Monday, 24 August 2026 05:57:27 AM

పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, దెందులూరు కాంగ్రెస్ నాయకులు ఆలపాటి నరసింహమూర్తి

Date : 16 November 2024 02:26 PM Views : 1338

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : నవంబర్ 16 ,సాక్ష్యం న్యూస్ పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరి పైన ఉందని దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆలపాటి నరసింహమూర్తి అన్నారు .శనివారం ముండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ నలుమూలల ఏ సమస్య ఉన్న క్షణంలో ప్రపంచానికి తెలియజేసే గురుతల బాధ్యతను పాత్రికేయులందరూ అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారు అన్నారు .ఏ ప్రభుత్వమైనా పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలన్నారు .విధి నిర్వహణలో సమాజ శ్రేయస్సు కోసం విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులందరికీ రక్షణ భద్రత భవిష్యత్తు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఆలపాటి నరసింహామూర్తి పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: