Friday, 19 June 2026 01:47:44 PM

ఆర్.టీ.సి.బస్సు ఢీ కొని వృద్దురాలు మృతి.

Date : 07 October 2024 07:58 PM Views : 467

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబరు 7 సాక్ష్యం న్యూస్: మండలంలోని అనంతవరం సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలు దేవరాపల్లి కన్నమ్మ (79)ని ఆర్.టీ.సి.బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు ఎస్.ఐ.జామి సురేష్ అందించిన వివరాల ప్రకారం పెంట గ్రామానికి చెందిన దేవరాపల్లి కన్నమ్మ (79) అనంతవరం నుండి తన గ్రామానికి నడుచుకుంటూ వెలుతున్న నేపథ్యంలో గ్రామానికి సమీపంలోని పైడితల్లిమ్మ అమ్మవారి గుడి వద్ద వెనుక నుండి వచ్చిన ఆర్ టి సి బస్సు డీకొంది. దీంతో కన్నమ్మ అక్కడకక్కడే మృతి చెందింది. బందువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Naidu (Sr Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :