Friday, 19 June 2026 01:34:26 PM

మైనింగ్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దు.

Date : 27 August 2024 09:25 AM Views : 585

Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : ఆగస్టు 27 ఆనందపురం సాక్ష్యం న్యూస్: ఆనందపురం మండలం కుసులువాడ పంచాయతీలు మైనింగ్ తవ్వకాల అనుమతుల కొరకు ప్రజాబిప్రాయ సేకరణను తిప్పి కొట్టాలని గిరిజనుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా కూసులువాడ పంచాయతీ చిన్నయ్యపాలెం, ఇచ్చాపురం తదితర గ్రామాలలో సిపిఎం నాయకులు 78 వ వార్డు కార్పొరేటర్ గంగారావు గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కోటి , సిఐటియు నాయకులు రవ్వ నర్సింగరావు గ్రామాలలో పర్యటించారు. కుసులవాడ చిన్న మెట్ట మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని, ఈనెల 28న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను త్రిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గిరిజనులపై చిన్నచూపు కొనసాగుతునే ఉందని,గిరిజన ప్రాంత ప్రజలకు ఎటువంటి భూపట్టాలు లేకపోవడంతో వారు ఏమి చేయలేరనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఇష్టానుసారంగా మైనింగులు అనుమతులు జారీచేస్తున్నాయన్నారని మండిపడ్డారు.

మైనింగ్ జరపటం ద్వారా వాతావరణం పంట పొలాలు ,త్రాగునీరు కలుషితమవుతుందన్నారు.ఈ నేపథ్యంలో కుసులవాడ ,గొల్లపాలెం ,రేగాని గూడెం, చిన్నయ్య పాలెం ఇచ్చాపురం గ్రామాలలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈనెల 28న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించాలని సూచించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: