Friday, 19 June 2026 01:52:24 PM

మెడికల్ కాలేజీకి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు సముచితం

Date : 13 November 2024 10:43 AM Views : 1161

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : నవంబర్ 13 : సాక్ష్యం న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఏలూరు మెడికల్ కాలేజీకి టెట్రాసైక్లిన్ సృష్టికర్త సైంటిస్ట్ డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని జనసేన దెందులూరు మండలం నేత, గోపన్నపాలెం గ్రామం మాజీ సర్పంచ్ కొండేటి హనుమంతు అన్నారు. బుధవారం దెందులూరు లో ఆయన మాట్లాడుతూ వైద్య రంగానికి డాక్టర్ సుబ్బారావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. టెట్రాసైక్లిన్ ప్రస్తుతం కోట్లాదిమంది ఉపయోగిస్తున్నారని ఆయన సేవలను మాత్రం ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మాత్రమే గుర్తించారని పవన్ కళ్యాణ్ కు కొండేటి హనుమంతు కృతజ్ఞతలు తెలియజేశారు. చరిత్ర ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ పేరు పెట్టించినందుకు టెట్రాసైక్లిన్ కనిపెట్టిన డాక్టర్ సుబ్బారావు పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :