Tuesday, 15 September 2026 05:39:47 AM

దెందులూరు తాసిల్దారుగా బి ,సుమతి

Date : 06 August 2024 08:17 AM Views : 474

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : ఏలూరు సాక్ష్యం ప్రతినిధి: దెందులూరు తాసిల్దారుగా బత్తుల సుమతి సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆమె2009లో ఏపీపీఎస్సీ గ్రూప్ టు లో డిప్యూటీ తాసిల్దారుగా ఎంపికయ్యారు.2012లో వరంగల్ జిల్లా నరసింహులు పేట తహసీల్దారుగా సర్వీసులో చేరారు. 2014లో ఖమ్మం జిల్లా కామేపల్లి తాసిల్దారిగా బదిలీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు తాసిల్దారుగా ఏలూరు కలెక్టరేట్లో ఆర్డీవో ఏ. ఓ జంగారెడ్డిగూడెం పోలవరం తాసిల్దారుగా పనిచేశారు.ఎన్నికల విధులు నిర్వహణ నిమిత్తం కృష్ణాజిల్లా చల్లపల్లి తాసిల్దార్ గా బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం జరిగిన బదిలీల్లో చల్లపల్లి నుంచి దెందులూరు తాసిల్దారుగా నియమితులయ్యారు..ఉన్నతాధికారుల ప్రోత్సాహం ప్రజా ప్రతినిధులు సిబ్బంది సహాయ సహకారాలతో దెందులూరు మండల అభివృద్ధికి కృషి చేస్థానని హామీ ఇచ్చారు

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :