Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : అక్టోబరు 3 సాక్ష్యం న్యూస్: భీమిలి ఆంద్ర బాప్టిస్ట్ చర్చి వేదికగా శుక్రవారం నాడు నిర్వహించే ఉచిత మెగా వైద్యశిభిరంలో భీమిలి పురః ప్రజలు పాల్గొని ఉచిత వైద్యసేవలను వినియోగించుకోవాలని భీమిలి YMCA అధ్యక్షులు K.S.M. సుధాకర్ పిలుపునిచ్చారు.విశాఖ వై. యం. సి. ఎ మరియు భీమిలి వై. యం. సి. ఎ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన దంత మరియు జనరల్ ఫిజీషియన్స్ పాల్గొని ఉచిత వైద్య సేవలు అందించడంతోపాటు అవసరమైన మందులను కూడా ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. అక్టోబరు 04- శుక్రవారం ఉదయం 9:00 గం. లనుండి మధ్యాహ్నం 3:00 గం.ల వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంబిస్తారని తెలిపారు.
Admin
Neti Sakshyam