Friday, 19 June 2026 01:44:45 PM

కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలి

Date : 06 August 2024 08:07 AM Views : 455

Neti Sakshyam - వార్తలు / Karnool/పత్తికొండ : మాదిగలు రిజర్వేషన్ ఫలాలు అందక అన్ని రంగాల్లో వెనుకబాటుతనానికి గురవుతున్నారని గుర్తించి ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ధర్మాసనం తీర్పునివ్వడం శుభపరిణామమని ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల ట ఎమ్ రమేష్ మాదిగ అన్నారు. ఆర్థిక సంక్షేమ పరిశ్రమ రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరం గౌరవనీయులు మంద కృష్ణ మాదిగ ఉద్యమం చేపట్టి లక్ష్యం నెరవేరే దాకా పోరాటం చేశారని, ఆయన స్ఫూర్తితో ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపకులు బుంగ సంజయ్ మాదిగ నిరంతరం రాష్ట్రంలో మాదిగలను చైతన్యవంతులు చేసి వర్గీకరణ బిల్లు చట్టబద్ధతే లక్ష్యంగా ఉద్యమాలు నడిపారని కొనియాడారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే సుప్రీంకోర్టు తీర్పును అమలుపరచి ఉద్యోగ నోటిఫికేషన్ లో ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. వర్గీకరణ అమలుపరిచి, మాదిగ, మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ఎస్ పత్తికొండ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: