Friday, 19 June 2026 01:29:56 PM

నేడు వికార్ జనరల్ డాక్టర్ ఫాదర్ పి బాల పుట్టిన రోజు వేడుక

Date : 21 November 2024 10:47 AM Views : 1519

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : నవంబర్ 21, సాక్ష్యం న్యూస్ ఆర్ సి ఎం ఏలూరుపీఠం వికార్ జనరల్ డాక్టర్ ఫాదర్ పి బాల పుట్టినరోజు వేడుకను సెంట్ జాన్స్ విద్యాసంస్థలు స్వచ్ఛంద సంస్థలు విద్య వైద్య సామాజిక సేవా రంగాల ప్రతినిధులు సమక్షంలో నేడు సోమవరప్పాడు సెయింట్ జాన్స్ విద్యాసంస్థల్లో జరుపబడును. 1962 నవంబర్ 22న పశ్చిమాల డేవిడ్, మరియమ్మ దంపతులకు పి.బాల జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం 1987 అక్టోబర్ 29న గురుపట్టాభిషేకం పొందారు. ధర్మాజీగూడెం రాళ్లకుంట కతీద్రల్ విచారణలో గురువుగా ఏలూరుపేట ప్రొక్యురేటర్ ఏలూరుపేట జ్యోతిర్మయి డైరెక్టర్గా పనిచేసి అందరు మన్ననలను పొందారు. కోస్తా జిల్లాలలో దంత వైద్య రంగంలో అధునాతన పరికరాలతో నిపుణులైన వైద్యులు సిబ్బందితో విప్లవాత్మక వైద్య సేవలు అందిస్తున్న దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల వైద్యశాల ఏర్పాటుకు ఫాదర్ బాల ప్రధాన కారకులు. ఏలూరుపీఠం ప్రథమాధిపతి ములగాడ జాన్ కు నమ్మకపాత్రునిగా ప్రస్తుత పీఠాధిపతి పొలిమేర జయరావుకు ఉత్తమ సహాయకునిగా అందిస్తున్న సేవలు ఆదర్శనీయం. నిరాడం భరత అపార అనుభవం ప్రేమ సేవలకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ ఫాదర్ పి బాల గా సర్వత్ర కొనియాడ బడుతున్నారు. ఫాదర్ బాల కుటుంబంలో ఐదుగురు వివిధ అంశాల్లో పరిశోధనలు చేసి డాక్టరేట్లు తీసుకోవడం ప్రత్యేక రికార్డ్. ప్రస్తుతం సోమవరప్పాడు సెయింట్ జాన్స్ డి ఈ డి కళాశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ గా ఏలూరు పీఠం వికార్ జనరల్గా పనిచేస్తున్నారు. పేదల పెన్నిధిగా ఐక్యత పెంపొందించేందుకు మార్గదర్శిగా27 సంవత్సరాలుగా ఏలూరు పీఠం పరిధిలో ఆధ్యాత్మిక విద్య వైద్య సేవ మౌలిక వసతులు కల్పన లో ఫాదర్ బాల అందించిన సేవలు ప్రశంసనీయం. క్రీస్తుతో 13140 రోజులు సుదీర్ఘ ప్రయాణం. క్రీస్తులో ఆధ్యాత్మికంగా 13140 రోజులు సుదీర్ఘంగా ప్రయాణం చేయడం తనకు ఆశీర్వాదంగా భావిస్తున్నానని సర్వేశ్వరుని దీవెనలు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో తాను పయనిస్తున్నానని 13140 రోజుల ఆధ్యాత్మిక సేవకు ప్రతి ఒక్కరికి తాను కృతజ్ఞుడు నై ఉంటానని వికార్ జనరల్ ఫాదర్ బాల అన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: