Tuesday, 25 August 2026 07:42:34 AM

గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

Date : 09 October 2024 01:41 PM Views : 718

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబర్ 9 సాక్ష్యం న్యూస్ దెందులూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య ,పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతోపాటు దోమల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీడీవో K. శ్రీదేవి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం దెందులూరు ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఆమెను పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు జోగన్నపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆనందకుమార్,శ్రీనివాస చౌదరి ,దోసపాడు పంచాయతీ కార్యదర్శి లక్ష్మి,తోపాటు పలువురు పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవోకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో గ్రామాల్లో పలు సమస్యలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శులు పని చేయాలని సూచించారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :