Monday, 14 September 2026 03:50:11 AM

డిగ్రీ విద్యార్ధిని వైద్యానికి "ఫాబ్" ఆర్థిక సాయం

Date : 31 July 2024 06:13 PM Views : 589

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : భీమిలి తోటవీధికి చెందిన డిగ్రీ విద్యార్థిని రాకోతు నిత్యశ్రీ హృదయ సంబంధమైన వ్యాధితో బాధ పడుతూ..చికిత్స చేయించుకుంటుండగా...ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉండటంతో ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమిలి (ఫాబ్) స్పందించి పదివేల రూపాయల ధనసహాయం అందించింది. గత కొంత కాలంగా ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్న నిత్యశ్రీ విశాఖలో వైద్యం చేయించుకోగా.. తాజాగా ఆమె హైదరాబాద్ లో లేజర్ చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం సుమారు రెండు లక్షల వరకూ ఖర్చవుతుందని తెలియడంతో "ఫాబ్" సభ్యులు స్పందించి పదివేల రూపాయలు అందజేశారు. దాతలు ముందుకొచ్చి మరింత సాయం అందించాలని ఫాబ్ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సన్నీ కాళ్ళ, సూర్య శ్రీనివాస్ ముసునూరి, రమణరావు కట్టమూరి, గోపి మారోజు తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :