Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఆరోపిస్తూ...ఆనందపురం పైడా కాలేజీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థానిక వైసిపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ప్రభుత్వానికి, కూటమి నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కోరాడ వెంకట్రావు, మండల వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ బంక సత్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి. వెంకట్రావు, ఎంపీటీసీలు, పంచాయతీ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam