Monday, 24 August 2026 05:12:24 AM

ఉండ్రాజవరం రోడ్డుకు మహర్దశ!.టిడిపి నేతల ఆధ్వర్యంలో పర్యవేక్షణ

Date : 14 September 2024 09:39 PM Views : 790

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : సెప్టెంబరు 14 సాక్ష్యం న్యూస్: గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఉండ్రాజవరం బూత్ ఇంచార్జ్ బాయి రాంప్రసాద్ అన్నారు. మండలంలోని ఉండ్రాజవరం నుండి పోతునూరు వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు మధ్యలో ఒక అడుగుకు పైగా లోతున గుంతలు దర్శనమిస్తూ ప్రమాదాలకు నిలయంగా మారాయని, చాలా కాలం నుంచి గుంతల మయంగా ఉన్న రహదారి ఇటీవల వరుసగా కురిసిన వర్షాలతో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ దృష్టికి స్థానికులు ఈ సమస్యను తీసుకువెళ్ళడంతో స్పందించిన చింతమనేని ప్రభాకర్ వెనువెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉండ్రాజవరం ప్రధాన రహదారిని వెడల్పు చేయడంతో పాటు రోడ్డు మరమ్మత్తు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: