Tuesday, 25 August 2026 07:44:38 AM

వృద్ధులకు కరుణా మినిస్ట్రీస్ చేయూత

Date : 05 October 2024 03:58 PM Views : 521

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబరు 5 సాక్ష్యం న్యూస్: వృద్ధులకు సేవ చేయడం,దేవుని సేవ తో సమానమని జోగన్నపాలెం కరుణా మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ చిన్న విజయ్ మోహన్ పాల్ అన్నారు.శనివారం వృద్ధురాశ్రమంలో రెవరెండ్ చిన్న విజయ మోహన్పాల్ వృద్దులతో మాట్లాడుతూ వారితో కొంత సమయాన్ని గడిపారు. గిరిజన గ్రామ శివారు ప్రాంతాల్లోని ఆదరణ కోల్పోయిన వృద్ధులకు తమ కరుణాశ్రమం అక్కున చేర్చుకుంటుందని గుర్తు చేసారు. వృద్ధాప్యంలో ఉండి ఆధారం లేని వృద్ధులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :