Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబరు 10 పద్మనాభం సాక్ష్యం న్యూస్: మండల కేంద్రమైన పద్మనాభం గ్రామంలో మాజీ సర్పంచ్ అవనాపు పద్మనాభం నివాసం వద్ద నిర్వహిస్తున్న గణపతి నవరాత్రులలో భాగంగా మంగళవారం అనంత పద్మనాభస్వామి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బారీ అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా పాల్గొన్న ఎంపీపీ. కంటుబోతు రాంబాబు స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన చేతులమీదుగా ప్రారంభించారు. మద్ది,ఇసుకలపాలెం ,పద్మనాభం గ్రామాల నుండి భక్తులు విశేషంగా తరలి వచ్చారు. ప్రతి ఏటా భక్తుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరం సుమారు మూడు వేల మందికి సరిపడా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాలాడ పాప,నాయకులు అవనాపు రమణ, ఎర్రినాయుడు, పద్మనాభం, సుమంత్ నాయుడు, శేషుకుమార్, తాలాడ అప్పన్న, తాలాడ శివ, పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam