Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : ఆనందపురం పోలీస్ స్టేషన్ ను బుధవారం రాత్రి 7గంటల సమయంలో సందర్శించిన విశాఖ సి.పి శంఖ బ్రత బాగ్చీ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాలని స్టేషను సిబ్బందిని ఆదేశించారు. సమస్యలపై వచ్చే ఫిర్యాదుదారులతో క్రమశిక్షణ కలిగి ప్రవర్తించాలని, స్టేషన్ పరిసరాలలో వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్టేషను సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Admin
Neti Sakshyam