Monday, 24 August 2026 07:07:46 AM

కొవ్వలి బాలుర వసతి గృహాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

Date : 03 October 2024 07:53 PM Views : 575

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబర్ 3 సాక్ష్యం న్యూస్: దెందలూరు మండలం కొవ్వలి గ్రామంలోని సాంఘీక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంవద్ద డ్రైనేజి సమస్య, మురుగునీరు పారుదల తదితర విషయాలపై చర్యలకోసం గత నెల 26వ తేదీన సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించడం జరిగింది. ఈ నేపద్యంలో బుధవారం వసతిగృహాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రారంభమైన పనులను పరిశీలించి డ్రైనేజి సమస్యను వెంటనే పరిష్కరించి మురుగునీరు పారుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. పగిలిపోయిన పైపు లైనును మార్పుచేయాలని ఆదేశించారు. అదే విధంగా పాడైపోయిన డోర్ లు, కిటికీలను మరమ్మత్తు చేసేందుకు అంచనాలు తయారుచేయాలని పంచాయితీ రాజ్ అధికారులను ఆదేశించారు. పూర్తిస్ధాయిలో పనులన్నింటిని పూర్తిచేయాలని ఆదేశించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: