Friday, 19 June 2026 01:27:58 PM

విద్యార్థులకు ఘట్టమనేని ప్రోత్సాహం

Date : 19 October 2024 09:15 PM Views : 1158

Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : అక్టోబరు 19 సాక్ష్యం న్యూస్: విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్య అభివృద్దిని కలిగి ఉండాలని శ్రీ మహాలక్ష్మి కల్చర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ అన్నారు. మండలంలోని గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ వ్రాత పరీక్షల్లో విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు పోటీ తత్వం కలిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ పరీక్షలలో ఉత్తీర్ణత కలిగి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవశం చేసుకున్న విజేతలకు 4,000/- 3000/- 2000/-చొప్పున తన సొంత నిధుల నుంచి ప్రోత్సాహకాలను అందించారు. ఈ కార్యక్రమంలో దిబ్బడ పాలెం గిరిజాల గ్రామపంచాయతీ నాయకులు, హై స్కూల్ హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

B.Guruvulu ( Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: