Friday, 19 June 2026 01:25:59 PM

సమస్యలు పరిష్కరించాలంటూ భీమిలి CHCలో కార్మికులు నిరసన.

Date : 01 September 2024 08:33 PM Views : 515

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : సెప్టెంబరు 1 భీమిలి సాక్ష్యం న్యూస్: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ కార్మికులు, నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్లు, సెక్యూరిటీ సూపర్వైజర్లు దళారీలగా వ్యవహరిస్తూ...ప్రతి నెలా జీతాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, పెరిగిన వేతనాలు కూడా చెల్లించకుండా తమ జీవితాలతో ఆడుకుంటుంన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 నెలలుగా దశల వారీగా వేతనం కోసం, ఉద్యోగ భద్రత కోసం ఉద్యమాలు, శాంతియుత పద్ధతిలో నిరసనలు చేస్తున్నప్పటికీ.. దీనిపై సంబంధిత జిల్లా అధికారులు దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం జిఓ వున్నప్పటికీ శ్రమకు తగిన జీతం ఇవ్వకపోగా సకాలంలో జీతాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కారించకుంటే జిల్లా వ్యాప్తంగా ఈనెల 15వ తేదీ నుండి విధులు భవిష్కరణ వంటి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ, భవాని , రామలక్ష్మి, వెంకట లక్ష్మి, మహా లక్ష్మి నాయుడు , ఎన్.లక్ష్మి డి.ఈశ్వరమ్మ, ఎస్ ఎల్లాజీ,పెంటయ్య, ఎన్.నూక రాజు బి లక్ష్మి,శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :