Friday, 19 June 2026 01:22:57 PM

ప్రజా అవసరాల కోసమే సహకార బ్యాంకులు.

Date : 06 October 2024 06:34 PM Views : 490

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబరు 4 పద్మనాభం సాక్ష్యం న్యూస్: సహకార బ్యాంకు చైర్మన్ మయూర అశోక్ ఆధ్వర్యంలో పద్మనాభం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ఎ.టి.యంను శుక్రవారం భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన వినియోగదారులతో మాట్లాడుతూ మెరుగైన సమాజం కోసం సహకార బ్యాంకులు దోహదపడతాయన్నారు. రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ బ్యాంకు పరిదిలోని గందవరం,పద్మనాభం, బాందేవుపురం, మజ్జిపేట, పాండ్రంగి, రెడ్డిపల్లి సహకార బ్యాంకుల ద్వారా 27 కోట్ల రూపాయలను రుణాలగా 7500 మంది రైతులు గతంలోనే పొందారని బ్యాంకు మేనేజర్ బోని వెంకట అప్పారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె.రాంబాబు,సి ఈ ఒ డి.వి.ఎస్.వర్మ, పార్టీ అధ్యక్షుడు రమణ, మాజీ జెడ్పీటీసీ దాము ,అధికారులు పాల్గొన్నారు.

Naidu (Sr Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :