Monday, 24 August 2026 05:54:41 AM

సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళిన దొన్నుదొర

Date : 01 August 2024 08:28 PM Views : 468

Neti Sakshyam - వార్తలు / అరకు : డుంబ్రిగూడ: అరకు లోయ సమస్యల పరిష్కారానికి అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ని అరకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ సివేరి దొన్నుదొర కలిసి స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. అరకు నియోజకవర్గ 6మండలాల్లోని త్రాగునీరు, రోడ్డు సౌకర్యాలు, శిధిలావస్థలో ఉన్న వంతెనలు చెక్ డ్యాంలు. నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని కోరారు. నిధులు మంజూరు చేసి అంగనవాడీ భవనాలు నిర్మించాలని కలెక్టర్ ని వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముంచంగిపుట్టు మండలం అధ్యక్షులు కిల్లొ బలరాం, మాజీ ఎంపీటీసీ వెంకటరావు, ఎస్టీ సెల్ అరకు అసెంబ్లీ అధికార ప్రతినిధి శంకర్ నాయుడు, కొర్ర నర్సింగరావు, దితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :