Monday, 24 August 2026 07:06:54 AM

తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన పాప ప్రక్షాళనకు అనంతుని ఆలయంలో వైసీపీ పూజలు.

Date : 28 September 2024 05:22 PM Views : 613

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబరు 28 సాక్ష్యం న్యూస్: మండలం లోని అనంత పద్మనాభ స్వామి కొండ దిగువన ఉన్న కుంతీ మాధవ స్వామి ఆలయంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని ఆరోపిస్తూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీయడాన్ని,స్వామి ప్రతిష్ఠకు భంగం కలిగించిన కూటమి ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ..రాష్ట్ర వైసీపీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం పద్మనాభం ఎంపీపీ కె.రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణరావు, నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి లడ్డూపై చంద్రబాబు చేసిన దుష్ప్రచారం వలన ప్రజలకు కీడు జరగకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యంలో ఉన్న స్వామివారి లడ్డూను అప్రతిష్టపాలుచేయడం, భక్తుల మనోభవాలను దెబ్బతీయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్‌ గిరుబాబు, నాయకులు సన్యాసినాయుడు,పద్మనాభం, నారాయణరావు, సత్యనారాయణ, పిల్లా గోవింద్,ఈశ్వరరావు, నర్శింహనాయుడు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: