Tuesday, 25 August 2026 07:44:23 AM

సంగివలసలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

Date : 19 October 2024 02:23 PM Views : 835

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ తగరపువలస : అక్టోబర్ 19 సాక్ష్యం న్యూస్ : జిల్లా అందత్వ నివారణ సంస్థ విశాఖపట్నం వారి సౌజన్యంతో, శ్రీమతి గంటా శారదమ్మ హెల్పింగ్ హాండ్స్ మరియు వెంపాడ వెల్ఫేర్ సొసైటీ వారి సహకారంతో సంగివలస లక్ష్మీ విజయ మెడికేర్ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో సుమారు100 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 39 మందికి ఆపరేషన్ అవసరతను గుర్తించారు.మరి కొందరికి ఉచిత మందులు,కళ్ళద్దాలు పంపిణీ చేసారు. వెంపాడ శ్రీనివాసరెడ్డి ప్రారంబించిన ఈ కార్యక్రమంలో వెంపాడ వెల్ఫేర్ సొసైటి సేవకులు , శంకర్ ఫౌండేషన్ డాక్టర్ శ్రీనిజా, ఆప్తలమిక్ ఆఫీసర్ గంగాధర్, శంకర్ ఫౌండేషన్ క్యాంపు కో ఆడినేటర్ వై. రాజు, నర్సింగ్ స్టాఫ్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

D.Appalaraju (Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :