Tuesday, 25 August 2026 07:41:46 AM

పద్మనాభం భవితా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ

Date : 13 August 2024 04:58 PM Views : 544

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : ఆగస్టు 13 సాక్ష్యం ప్రథినిధి: పద్మనాభం భవితా కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి M. వెంకట శేషమ్మ సందర్శించారు. ఈ కేంద్రంలో గల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రభుత్వం ద్వారా అందజేయబడుతున్న విద్యాపరమైన అవకాశాలను మరియు కల్పించబడుతున్న మౌళిక వసతులను గురించి, ఇంకా వారికి ఎదురవుతున్న సమస్యల గురించి విద్యార్ధుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అదే సందర్భంలో వారికి ఇంకా అవసరమైన సౌకర్యాల కల్పనకు తగు చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారి వారికి, సహిత విద్య విభాగ జిల్లా సమన్వయాధికారిణి వారికి తగు సూచనలు చేశారు.

ఈ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు బోధనా సిబ్బంది మరింతగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మనాభం మండల విద్యా శాఖాధికారి Sd. బాబులాల్, సహిత విద్యా విభాగ జిల్లా సమన్వయాధికారిణి, B. గీత, భవితా కేంద్ర రిసోర్స్ పర్సన్ లు H. రాజ్ కుమార్, M. శ్రీనివాసరావు లు , ఎంపీపీ స్కూల్ HM, M. ప్రశాంతి మరియు దివ్యాంగ పిల్లలు, వారి తల్లిదడ్రులు కూడా పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :