Monday, 09 February 2026 05:50:16 AM

పద్మనాభం సంతబయలులో బారీ అన్న సమారాధన.

Date : 12 September 2024 03:56 PM Views : 1678

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబర్ 12 పద్మనాభం సాక్ష్యం న్యూస్: మండల కేంద్రమైన పద్మనాభం గ్రామంలో సంతబయలు వద్ద నిర్వహిస్తున్న వినాయకుని నవరాత్రుల సందర్భంగా గురువారం పద్మనాభం భక్త బృందం ఆధ్వర్యంలో బారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాంబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సుమారు ఐదయ వేల మందికొరకు ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన చేతులతో భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జెడ్పీటీసీ ఎస్.గిరిబాబు, మండల వైసీపీయూత్ అధ్యక్షుడు బుగత సత్యనారాయణ, నాయకులు తాలాడ పద్మనాభం, లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు హరికుమార్, వాసు,సంపత్,గణేష్,నూకరాజు,శ్రీను,ఆనంద్ పాల్గొన్నారు.

News Desk

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :