Tuesday, 15 September 2026 05:39:57 AM

ఆబాల గోపాలంతో అబ్బుర పరచిన ది సన్ స్కూల్ పిల్లలు.

Date : 24 August 2024 06:21 PM Views : 581

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : ఆగస్టు 24 భీమిలి సాక్ష్యం న్యూస్: భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ..భీమిలి సన్ స్కూల్ ఆవరణలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం అబ్బురపరచే రంగవల్లులతో ఆబాల గోపాలం, పిల్లల కోలాటం, హరినామ కీర్తనల నడుమ కృష్ణాష్టమి వేడుకను కన్నుల పండువగా నిర్వహించారు. దీంతో పాఠశాల ఆవరణం రేపల్లె వెలుగుని సంతరించుకుంది. కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా ఏర్పాటు చేసిన ఉట్టి సంబరంలో ఉట్టికొట్టేందుకు ఒకరి తరువాత పాల్గొని పిల్లంతా ఎంజాయ్ చేశారు. యుగపురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆధునిక యుగానికి ఆదర్శప్రాయుడని, రానున్న తరాలకు దార్శినికతతోనే గొప్ప గీతోపదేశం ఇవ్వబడిందని.. ద సన్ స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీమతి కైతపల్లి లక్ష్మీలావణ్య ఈ సందర్భంగా విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు.అందరినీ ఆకట్టుకునేలా చక్కగా తయారైన చిన్నారులను, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను మరియు వారికి సహకరించిన తల్లిదండ్రులను ఆమె అభినందించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :