Friday, 31 July 2026 12:03:23 AM

"ఆగస్టు 14న విశాఖలో జెండా ఉంఛా రహే హమారా"

Date : 31 July 2024 07:15 PM Views : 468

Neti Sakshyam - వార్తలు / విశాఖపట్నం : విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేస్తున్న కృషి అభినందనీయమని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరబ్ గౌర్ అన్నారు. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆద్వర్యంలో ఈ నెల రెండో తేదీన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి నుండి ఆగస్టు15 వరకు నిర్వహిస్తున్న జెండా ఉంఛా రహే హమారా కార్యక్రమ ప్రోమో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఆయనతో పాటు ఏయూ ఇన్చార్జి వీసీ జి శశిభూషన రావు కలిసి ప్రోమోను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు అనగా ఆగస్టు 14వ విశాఖలోని ప్రభుత్వ మహిళ కళాశాల ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్క్ వేదికగా 25వేల చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని సుమారు 10,000 మంది విద్యార్థులు ఏకమై జాతీయ పతాక ప్రదర్శన చేపట్టేందుకు శ్రీకారం చుట్టడం యావత్ దేశానికే గర్వకారణంమన్నారు. ఈ కార్యక్రమానికి విశాఖ యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.అనంతరం స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేటి బసవ కృష్ణమూర్తి మాట్లాడుతూ... విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించడమే స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ముఖ్య ఉద్దేశమని, అందుకే ప్రతి ఏటా ఈ Championship చేయడం జరుగుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్ది భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ క్రియాశీలక కార్యవర్గ సభ్యులు కర్రి నరేష్, మహమ్మద్ ఇషాక్, కొయ్య రామకృష్ణ, ఉత్తరాంధ్ర విద్యార్థి సేన సభ్యులు కంఠంరెడ్డి సూర్య, వి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: