Wednesday, 16 September 2026 06:14:27 AM

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం

Date : 05 October 2024 03:38 PM Views : 599

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబర్ 5: సాక్ష్యం న్యూస్, దెందులూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వింత సంజీవరెడ్డి ,ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్రావు అన్నారు. శనివారం దెందులూరు నియోజకవర్గం మండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆలపాటి నరసింహమూర్తి అధ్యక్షతన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపి కూటమి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యం పోరాటం చేయాలని.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నేత ఆలపాటి చౌదరి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: