Monday, 24 August 2026 05:53:50 AM

నజరేతు ప్రార్ధనా మందిరంలో రెండవ రోజు ఉపవాస ఉజ్జీవ పండుగ

Date : 09 August 2024 10:47 PM Views : 537

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : ఆగస్టు 9 భీమిలి సాక్ష్యం ప్రథినిధి: దేవుని మందిరంలో క్రమశిక్షణ కలిగి ఉండాలని పలివెలకు చెందిన పాస్టర్ ప్రభుదాసు అన్నారు. ఆగష్టు 8,9,10 తేదీల్లో నిర్వహిస్తున్న ఉపవాస ఉజ్జీవ పండుగలకు ఆయన పాల్గొని దేవుని వర్తమానం అందించారు.ఆయనే సమస్త జనులకు దేవుడై యుండగా..ఆయన యందు భయ భక్తులు కలిగిఉండాలన్నారు. మరి ముఖ్యంగా దేవుని మందిరంలో క్రమశిక్షణ కలిగి ఉండటం, అన్నీ ఇచ్చిన దేవునికి సమయాన్ని కేటాయించి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం మనందరి భాద్యత అని గుర్తు చేశారు.

ఈ ఉపవాస ఉజ్జీవ పండుగలు 10వ తేదీతో ముగుస్తాయని..స్థానిక సంఘ కాపరి సంతోష్ పాల్ తెలిపారు.చివరి రోజైన శనివారం ఉదయం మరియు సాయంత్రం సభలలో విశాఖకు చెందిన పాస్టర్ పి.ఎలీషా మరియు అనకాపల్లికి చెందిన బిషప్ యస్. క్రాంతిపాల్ పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో సేవకులు సంజయ్ కుమార్, ఇమ్మానియేల్, ఇజ్రాయెల్ తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :