Monday, 14 September 2026 03:50:11 AM

దళితులు కుల వివక్షతకు గురవ్వాల్సిందేనా?

Date : 17 October 2024 12:53 PM Views : 882

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : అక్టోబరు 17 సాక్ష్యం న్యూస్: స్వాతంత్ర్య వచ్చి ఎన్నేళ్ళయినా...అట్టడుగు వర్గాలు కుల వివక్షతను ఎదుర్కొంటూనే ఉన్నాయని మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు బాగం గోపాలరావు అన్నారు. భీమిలి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ దళితుల పట్ల వివక్షత కొనసాగుతునే ఉందన్నారు. మధురవాడ శిల్పా రామంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులను నిర్వహిస్తున్న దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై ఎ.ఒ.విశ్వనాథ రెడ్డి లైంగిక వేదింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అతనితోపాటు అగ్ర వర్ణానికి చెందిన పద్మశ్రీ అనే మహిళ కూడా ఈమెపై కుల వివక్షతను చూపిస్తోందని మండిపడ్డారు.ఈ విషయంపై భాధిత మహిళ విశాఖ జిల్లా కలెక్టరుకు పిర్యాదు చేయడంతో పాటు సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని వివరించారు.అధికారులు ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి బాధ్యలుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మామిడి వెంకట శివ,పారుపిల్లి నర్సింగరావు, పొట్టా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: