Wednesday, 16 September 2026 06:11:09 AM

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ' ఒకరు మృతి.

Date : 26 August 2024 08:41 AM Views : 646

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : ఆగస్టు 25 పద్మనాభం సాక్ష్యం న్యూస్: సరెండు మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన పద్మనాభం మండలం చిన్నాపురం జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు పద్మనాభం పోలీసులు తెలిపారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఆనందపురం మండలం బోని గ్రామానికి చెందిన కనకల శ్రీనివాసరావు విజయనగరం నుండి బైక్ పై పద్మనాభం వైపు వస్తుంన్నాడు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఆర్.వి.అగ్రహారంకి చెందిన లెక్కల సతీష్, అతని భార్య కలిసి మరో బైక్ పై విజయనగరం వైపు వెళ్తుండగా చిన్నాపురం జంక్షనులో రెండు వాహనాలు ఎదురెదురుగా డీకొన్నాయి. దీంతో కనకల శ్రీనివాసరావుకి తీవ్ర గాయాలు తగలడంతో పోలీసులు విజయనగరం ఆసుపత్రికి తరలించగా మార్గ మద్యలో మృతి చెందాడు. సతీష్ కి , భార్య శ్రీదేవిలు కూడా గాయాలు పాలయ్యారు. దీంతో వీరిద్దరిని విశాఖ కె.జి.హాచ్.కి తరలించారు. మృతుని బందువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :