Monday, 24 August 2026 05:54:16 AM

పొలం బడి శిక్షణకు తాటితూరు గ్రామం ఎంపిక

Date : 08 August 2024 04:30 PM Views : 446

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : ఆగస్టు 8, సాక్ష్యం టివి డెస్క్: పండిన పంటను అధిక ధరకు (PFO) Farmers producers organisation ద్వారా అమ్ముకునే విధంగా రైతులకు పొలం బడి ద్వారా శిక్షణ ఇచ్చేందుకు తాటుతూరు గ్రామాన్ని ఎంపిక చేయటం జరిగిందని భీమిలి మండల వ్యవసాయాధికారి .B శివ కోమలి ఓ ప్రకటన చేశారు. రైతులకు 14 వారాల పాటు వారానికి ఒకరోజు చొప్పున ఈ శిక్షణ ఉంటుందన్నారు. ఇప్పటికే రైతులకు 50% రాయితీతో విత్తన శుద్ధి మందు అందుబాటులో ఉందన్నారు. ఎంపిక చేసిన రైతుల పొలాల్లోని మట్టిని పరీక్ష కొరకు నమూనాలు సేకరించి విశాఖ ప్రయోగశాల కు పంపటం జరిగిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పొలాల్లో దమ్ములు, ఉడుపులు చేపట్టే రైతులు నారు కట్టలు కట్టి, ఒకేమాదిరిగా చివర్లు త్రుంచి,అనంతరం మడిలో ఒక మూలన కుంటకట్టి, లేదా ఒక డ్రమ్ములో గానీ పావు లీటర్ క్లోరోపైరిఫాస్ మందును, 3-4 బకెట్లు నీటిలో కలిపి అందులో , చివర్లు త్రుంచిన నారుని వేర్లు మునిగేలా 10-15 నిముషాలుపాటు ఉంచి తరువాతనే వాటిని ప్రధాన పొలంలో ఉడుపు చేయడం మంచిదని సూచించారు. దీని వలన వల్ల ఆకుముడత,కాండం తొలిచే పురుగుల రాకుండా ఉంటుందని వివరించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :