Wednesday, 16 September 2026 06:11:08 AM

గెద్దపేట రామాలయం వద్ద అన్నసమారాధన

Date : 14 September 2024 09:43 PM Views : 562

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబర్ 14, సాక్ష్యం న్యూస్: మండలంలో గెద్దపేట గ్రామంలో రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నవరాత్రుల సందర్భంగా శనివారం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అన్న సమారాధన కార్యక్రమంను ఉత్సాహభరితంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల వైసీపీ అధ్యక్షుడు ,గ్రామ సర్పంచ్ కోరాడ లక్ష్మణరావు, మాజీ ఎంపీటీసీ కోండ్రోతు శ్రీనివాసరావు ,గద్ద సూరినాయుడు, జి.శ్రీను, జి.ప్రసన్నకుమారలతో పాటు పలువురు స్వామివారికి పూజలు చేసారు.

అనంతరం వినాయక మండపం వద్ద సుమారు మూడు వేల మందికి అన్నదానం చేసారు. అయితే ఈ ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదానం అనంతరం రామాలయ వీదిని శుభ్రం చేసారు. అలాగే సోమవారం విగ్రహం అనుపోత్సవం జరుగుతుందని గ్రామ సర్పంచ్ లక్ష్మణరావు చెప్పారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :